గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2016 (16:43 IST)

'ఖైదీ నం.150' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేనట్టే... 18న చిరంజీవి 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు'

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత తీస్తున్న చిత్రం 'ఖైదీ నం.150'. పైగా ఇది ఆయన 150వ చిత్రం. తమిళ చిత్ర 'కత్తి'కి రీమేక్. వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, మెగా పుత్రుడు రాంచరణ్ నిర్మాత.

మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత తీస్తున్న చిత్రం 'ఖైదీ నం.150'. పైగా ఇది ఆయన 150వ చిత్రం. తమిళ చిత్ర 'కత్తి'కి రీమేక్. వివి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, మెగా పుత్రుడు రాంచరణ్ నిర్మాత. 
 
ప్రస్తుతం ఈచిత్రం టీజర్, ట్రైలర్లు ఆన్‌లైన్‌లో సందడి చేస్తున్నాయి. ఇవి విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల మంది నెటిజన్లు వీక్షించి సూపర్బ్ అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇంతలో వారికి ఓ షాకింగ్ న్యూస్‌ను చిత్ర యూనిట్ వెల్లడించింది. 
 
మెగా ఫ్యామిలీ హీరోలు నటించిన 'సరైనోడు', 'ధృవ' చిత్రాల మాదిరిగానే 'ఖైదీ నంబర్ 150'కి ఆడియో ఫంక్షన్ ఉండదన్న టాక్. పనిలోపనిగా అభిమానుల కోసం ఈ నెల 18న 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' అనే సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. 
 
ఈ నెల 25న ఆడియోను డైరెక్టుగా మార్కెట్‌లోకి రిలీజ్ చేసి.. తర్వాత సినిమా విడుదలకు ముందు ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. అయితే, ఆడియో రిలీజ్ వేడుకల రద్దుపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం లేదు.