శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 17 డిశెంబరు 2014 (22:32 IST)

ఆమె క్రేజ్‌ అలా వుందట... దీపికా పదుకునె ఐశ్వర్య కంటే ఎక్కువ తీసుకుందట...

బాలీవుడ్‌లో హీరోయిన్లకు క్రేజ్‌ వుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. తాజాగా దీపికాపదుకొనే క్రేజ్‌ ఎక్కడికో వెళ్ళిపోయింది. రేస్‌-2 నుంచి హ్యాపీ న్యూ ఇయర్‌ వరకు ఆమె రేంజ్‌ పెరిగిపోయింది. హ్యాపీ న్యూయర్‌లో కథ ఏమీలేకపోయినా.. మల్టీస్టారర్‌ వున్నా... దీపికా కోసమే యూత్‌ వస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆమధ్య ఓ సినిమాలో కూడా అర్థరాత్రి సెక్సీ సీన్‌ కూడా చేసేసింది. నజిరుద్దీన్‌షా నటించిన ఆ సినిమాలో జర్నీ నేపథ్యంలో సాగుతుంది. అందుకేనేమో యువత క్రేజ్‌ను బట్టి.. సినిమాలు బాగా వస్తున్నాయని బాలీవుడ్‌ కథనాలు చెబుతున్నాయి. 
 
ప్రస్తుతం ఆమె రేటు 9 కోట్ల వరకు వెళ్ళిందని బాలీవుడ్‌ మీడియా వెల్లడిస్తోంది. గతంలో కరీనాకు 7కోట్లు వుండేవి. ఇప్పుడు దాన్ని బీట్‌ చేసిన దీపికా.. ఐశ్వర్యారాయ్‌ కంటే ఎక్కువే తీసుకుందని విశ్లేషకులు పోలుస్తున్నారు. ఏది ఏమైనా దీపికా పదుకునేకాదు.. నుంచునే... అనే సెటైర్లు వేస్తున్నారు కొందరు.