మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (18:38 IST)

కీర్తి సురేష్ కనిపిస్తే దర్శకనిర్మాతలు దాక్కుంటున్నారట, ఎందుకు...? (Video)

మహానటి తరువాత కీర్తి సురేష్ పేరు అందరూ మరిచిపోయారు. అందరూ ఆమెను మహానటి అనే పిలుస్తున్నారు. ఆ సినిమా అంతగా పేరు తెచ్చింది. అంత విజయవంతమైన సినిమాలో నటించిన తరువాత కీర్తి ఒక్కసారిగా చాలా బిజీ అయిపోవాలి.
 
కానీ వాస్తవానికి అలా జరగలేదంటున్నారు సినీ విశ్లేషకులు. నెమ్మదిగానే కీర్తి సినిమాలు చేస్తోందట. ముఖ్యంగా టాలీవుడ్ మీద కీర్తి శీతకన్నే వేసిందంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం లేకపోలేదట. కీర్తికి కథ చెప్పడానికి ఎవరైనా వెళితే ముప్పుతిప్పలు పెడుతోందట.
 
గతంలో ఈ ఇబ్బంది లేకపోయినా ఇటీవల కాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. కథ, పాత్ర మాత్రమే కాకుండా బడ్జెట్ వంటి విషయాలు కూడా ఆరా తీస్తోందట. వీటితో పాటు వ్యక్తిగత కండిషన్లు పెడుతోందట. ఇన్ని తిప్పలు పడి కీర్తిని ఒప్పించడం కన్నా వేరే హీరోయిన్‌తో చేసుకోవడం బెటరని చాలామంది దర్సకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడం లేదట. అంతేకాదు ఇలా చేదు అనుభవం ఎదురైన దర్శకనిర్మాతలు కీర్తి సురేష్ కనిపిస్తే చాలు, తప్పించుకుని తిరుగుతున్నారట.