శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 6 మే 2019 (20:55 IST)

ఎన్టీఆర్ దెబ్బ‌కు డీలాప‌డ్డ క్రిష్‌.. హిట్ కోసం ప‌క్కా ప్లాన్

గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌. ఆ త‌ర్వాత వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. అయితే... నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అని రెండు పార్టులుగా తీయ‌డం తెలిసిందే.
 
ఈ సినిమా డిజాష్ట‌ర్ అయి షాక్ ఇచ్చింది. దీనికితోడు మ‌ణిక‌ర్ణిక సినిమా వివాదాస్ప‌దం కావ‌డంతో క్రిష్ బాగా డీలాప‌డ్డాడు. దీంతో క్రిష్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. క్రిష్ తన తరవాత సినిమా తెలుగులో చేయడంలేదని టాక్. ఆయన మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లనున్నారని సమాచారం. 
 
కాగా ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా తెరకెక్కించారు క్రిష్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 
 
తనకు బాలీవుడ్లో ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన‌ అక్షయ్ కుమార్‌నే మళ్లీ క్రిష్ సంప్రదించారని అంటున్నారు. ఇప్పటికే అక్షయ్‌కు క్రిష్ కథ చెప్పారట. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే.. ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదని అంటున్నారు. మొత్తానికి క్రిష్ తరువాత సినిమా బాలీవుడ్‌లో చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్త‌వం ఎంతో తెలియాల్సివుంది.