బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2017 (16:44 IST)

పవన్ అడిగితే ప్రాణమైనా యిస్తా - దర్శకుడు మారుతి

రచయిత, సహ నిర్మాత, దర్శకుడు ఇలా చెప్పుకుంటూపోతే మారుతి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2004 సంవత్సరంలో తెలుగు సినీపిశ్రమలో సహ నిర్మాతగా చేరిన మారుతి ఇప్పుడు విలక్షణమైన దర్శకుడు. ఈయన తీసే సినిమాలంటే యువత పడిచచ్చిపోతారు. వెరైటీ కథతో ప్రతి ఒక్కరికి అర్థమయ

రచయిత, సహ నిర్మాత, దర్శకుడు ఇలా చెప్పుకుంటూపోతే మారుతి గురించి ఎంత చెప్పినా తక్కువే. 2004 సంవత్సరంలో తెలుగు సినీపిశ్రమలో సహ నిర్మాతగా చేరిన మారుతి ఇప్పుడు విలక్షణమైన దర్శకుడు. ఈయన తీసే సినిమాలంటే యువత పడిచచ్చిపోతారు. వెరైటీ కథతో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సినిమా తీయడం మారుతికి అలవాటు. భలేభలే మగాడివోయ్.. బాబు బంగారం, మహానుభావుడు ఇలా హిట్ సినిమాలే కాదు ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు మారుతి. కొత్తజంట కథతో కొత్త సినిమాను తీశారు.
 
దర్శకుడు మారుతి సినిమా అయితే ఆ సినిమాలో ఏ హీరోయిన్, ఏ హీరో అనేది అసలు పట్టించుకోరు. నేరుగా థియేటర్లకు వెళ్ళిపోతుంటారు. అలాంటి మారుతి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఎప్పటి నుంచో పవన్ అంటే మారుతికి ఇష్టం. అందుకే జనసేన పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు మారుతి. ఒకవైపు సినిమాలు.. మరోవైపు ప్రజా సేవ చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని మారుతి స్వయంగా మీడియాకు చెప్పారు. 
 
పవన్ పిలిస్తే జనసేనలోకి వెళ్ళేందుకు సిద్థంగా ఉన్నా.. అస్సలు అన్న(పవన్) అడిగితే ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నారు మారుతి. మరి పవన్ పిలుపు కోసం మారుతి వెయిట్ చేస్తుంటే పవన్ మాత్రం ఎవరినీ పార్టీలోకి ఆహ్వానించడం లేదు. మారుతి ఒక్కరే కాదు.. ఎంతోమంది పవన్ జనసేనలోకి ఎప్పుడూ పిలుస్తారా అని వెయిట్ చేస్తున్నారు.