శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: బుధవారం, 31 మే 2017 (17:59 IST)

రాజమౌళిని చెడుగుడు ఆడుకుంటున్న నెటిజన్లు... ఎందుకని?

రాజమౌళి అంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతటి పేరుందో వేరే చెప్పక్కర్లేదు. వివాదాలకు చాలా చాలా దూరంగా వుండే రాజమౌళి ఇటీవల ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మెగా నిర్మాత అల్లు అరవింద్ అంటే తనకు చాలా చాలా కోపం వుందంటూ సెలవిచ్చారు. ద

రాజమౌళి అంటే ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతటి పేరుందో వేరే చెప్పక్కర్లేదు. వివాదాలకు చాలా చాలా దూరంగా వుండే రాజమౌళి ఇటీవల ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మెగా నిర్మాత అల్లు అరవింద్ అంటే తనకు చాలా చాలా కోపం వుందంటూ సెలవిచ్చారు. దానికి కారణాలను కూడా చెప్పేశారు. ఇక అక్కడ్నుంచి స్టార్టయింది రాజమౌళి పైన విమర్శలు. 
 
మగధీరకు 100 రోజులు ఆడే స్టామినా లేకపోయినా ఆడించారనీ, అలాంటి చిత్రం 100 రోజుల కార్యక్రమానికి తను దూరంగా వున్నానంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటరిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంటారనీ, అది వ్యాపారానికి సంబంధించిందని పేర్కొంటున్నారు. 
 
రాజమౌళి తీసిన కొన్ని చిత్రాల్లో ఇతర చిత్రాలకు సంబంధించిన వాటిని కాపీ కొట్టి పెట్టడం లేదా... దాన్నేమనాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓ చిత్రాన్ని తీస్తున్నప్పుడు పలు చిత్రాల నుంచి స్ఫూర్తి తప్పదనీ, అలాగే కాపీ కొట్టుడు కూడా తప్పదనీ, ఆ లెక్కన ఇది తప్పు కాదా అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. మరి రాజమౌళి దీనిపై ఎలా ఓపెన్ అవుతారో వెయిట్ అండ్ సీ.