గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 20 మే 2020 (14:35 IST)

అర్జున్ రెడ్డి డైరెక్టర్... ఆ రీమేక్ మూవీని డైరెక్ట్ చేయనున్నాడా..? (video)

"అర్జున్ రెడ్డి" సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెండెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. టాలీవుడ్‌లో ఈ సినిమా ట్రెండ్ క్రియేట్ చేసింది. దీంతో బోల్డ్ కంటెంట్‌తో మరిన్ని సినిమాలు వచ్చాయి కానీ.. ఆ సినిమాలు "అర్జున్ రెడ్డి" సినిమాలా సక్సెస్ సాధించలేదు. 
 
'అర్జున్ రెడ్డి' సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేసారు. 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ అయ్యింది. ఈ రీమేక్ ను కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లోనూ అర్జున్ రెడ్డి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కోలీవుడ్ లో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా సక్సస్ సాధించింది.
 
దీంతో సందీప్ రెడ్డి వంగాకు మరింత డిమాండ్ పెరిగింది. అయితే... సూపర్ స్టార్ మహేష్‌ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో సినిమా చేయాలని ప్లాన్ చేసాడు కానీ.. వర్కవుట్ కాలేదు. 
 
తాజా వార్త ఏంటంటే... మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో నందమూరి నట సింహం బాలకృష్ణ - దగ్గుబాటి రానా నటించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ మూవీకి దర్శకుడిగా సందీప్ పేరు వినిపిస్తోంది. 
 
సందీప్ రెడ్డి అయితే.. ఈ సినిమాకి న్యాయం చేస్తాడని అంటున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా గురించి అఫిషియల్‌గా ఎనౌన్స్ చేస్తారని తెలిసింది. మరి... రీమేక్ మూవీ చేయడానికి సందీప్ రెడ్డి ఓకే చెబుతారా..? లేక నో చెబుతారా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.