గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (13:20 IST)

రాజ‌మౌళిని బాల‌కృష్ణ ఏం అడ‌గ‌బోతున్నాడో తెలుసా!

Balakrishna, Rajamouli
నంద‌మూరి బాల‌కృష్ణ ఓటీటీ ఆహా!లో హోస్ట్‌గా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. “అన్ స్టాప్పబుల్” అనే ఈ గ్రాండ్ టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తాజాగా రేపు ఆదివారంనాడు ఎస్ ఎస్ రాజమౌళిని ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నాడు. ఆయ‌న‌తోపాటు కీర‌వాణి కూడా వున్నారు. మామూలుగా బాల‌కృష్ణ ప్ర‌శ్న‌లు ఒక‌ర‌కంగా వుంటాయి. విమ‌ర్శ‌నాత్మ‌కంగా అనిపిస్తాయి. ఇప్పుడు రాజ‌మౌళితో వారి కుటుంబ స‌పోర్ట్ గురించి అడుగుతూ త‌న కుటుంబంలోనూ అన్న‌ద‌మ్ములు స‌పోర్ట్ గురించి ప్ర‌స్తావించిన‌ట్లు తెలిసింది. ఇద్ద‌రు కుటుంబాలు సినీమా కుటుంబాల‌నే ప్ర‌శ్న‌ వేశార‌ని అందుకు రాజ‌మౌళి ఏం స‌మాధానం చెప్పాడ‌నేది రేపు చూడాల్సిందేన‌ని అంటున్నారు.
 
Rajamouli, Keeravani
వీరి ఎపిసోడ్‌కు సంబంధించిన స్టిల్‌ను ఆహా! ఓటీటీ విడుద‌ల చేసింది. అయితే రాజ‌మౌళితో ఎక్క‌డా కాంట్ర‌వ‌ర్సీలేవుకానీ, ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ఫంక్ష‌న్ మొద‌ట ముంబైలో ఆ త‌ర్వాత ద‌క్షిణాదిలో పెట్టి చివ‌రికి హైద‌రాబాద్‌లో పెట్ట‌డానికి కార‌ణం ఏమిట‌నేది ఇక్క‌డ మీడియా అడుగుదామంటే నిర్వాహ‌కులు అడ్డుకున్నారు. మ‌రి రేపు బాల‌కృష్ణ ఈ విష‌య‌మై అడ‌గ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి రాజ‌మౌళి ఏం చెబుతాడో చూడాల్సిందే.