పుష్ప 2తో అల్లు అర్జున్ ప్రత్యేక ఏమిటో తెలుసా!
అల్లు అర్జున్ నిన్ననే తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజును కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకున్నాడు. కాగా ఇప్పుడు పుష్ప2పైనే ఆయన కానషన్ ట్రేషన్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటించనున్న సీక్వెల్ పుష్ప2. ఇందులో సుకుమార్ ఓ కొత్త ప్రయోగం అర్జున్‌తో చేయించున్నట్లు తెలుస్తోంది. డాన్స్‌లో సరికొత్త ప్రక్రియను అల్లు అర్జున్ నేర్చుకున్నాడట. ఇటీవలే ఆర్.ఆర్.ఆర్.లో నాటునాటు.. సాంగ్.. ఎంత పాపుల్ అయిందో తెలిసిందే. అందుకే హాలీవుడ్‌లోని మైకెల్ జాక్సన్‌కు చెందిన ఓ ఆల్బమ్‌కు చెందిన డాన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నల్లు సమాచారం.
మరోవైపు ఈ సినిమా మార్కెట్‌పరంగా వసూలు చేసిన రికార్డలను దృష్టిలో పెట్టుకుని తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా బాలీవుడ్‌లోని మార్కెట్ షేర్‌ను కోరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన గ్రీన్ సిగ్నల్ నిర్మాతలు ఇచ్చినట్లు తెలిసింది. రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.