సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 4 నవంబరు 2020 (20:58 IST)

సుధీర్‌ను అలా చూపిస్తారా? భగ్గుమన్న రష్మి

సుధీర్, రష్మి ఈ జంట గురించి చెప్పనవసరం లేదు. సుధీర్ పేరు వినబడితే ఆటోమేటిక్‌గా రష్మి పేరు మారుమ్రోగుతుంది. ఇక రష్మి గురించి మాట్లాడుతుంటే సుధీర్ గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇద్దరి గురించి ప్రచారం తారాస్థాయిలోనే సాగుతోంది.
 
దానికంతా కారణంగా జబర్దస్త్. ఇప్పడు ఢీ షో. బుల్లితెరపై ఈ షో సృష్టించిన రికార్డ్ అంతాఇంతా కాదు. ఇప్పుడు ఈ షోలో ఇద్దరి గురించి చర్చ నడుస్తుంది. క్వార్టర్ ఫైనల్ షోలో సుధీర్‌ను అవమానించే విధంగా చూపించారట. ఆ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
అయితే తను అవమానకరంగా చూపించినా సుధీర్ పట్టించుకోలేదు కానీ.. రష్మి మాత్రం బాగా ఫీలవుతుందట. ఎందుకలా సుధీర్‌ను చూపించారంటూ నిర్వాహకులపై మండిపడిందట. ఏదైనా సరే సమపాళ్ళలోనే ఉండాలి. శృతిమించితే అది విమర్సలకు తావిస్తుంది.
 
సుధీర్ విషయంలోను మీరు అలాగే చేశారంటూ ఆ షో నిర్వాహకుడిపై అంతెత్తు లేచారట రష్మి. తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా రష్మి తీసుకోవడంతో సంతోషంగా ఉన్నాడట సుధీర్. మరోవైపు ఫ్యాన్స్ కూడా షో నిర్వాహకులపై మండిపడిపోతున్నారట. ఈ షోలో ప్రియమణి, రష్మిలు ఏడుస్తూ కనిపించడం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీస్తోందట.