నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. సమంత

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (12:06 IST)

samanta-nagachaitanya

ఇదేంటి.. పెళ్ళికి ఎవరినైనా పిలుస్తారు. అందులోనూ శత్రువులైనా పెళ్ళి పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తారు. అలాంటిది పెళ్ళికి రావొద్దంటూ సమంత చెప్పడమేంటి అనుకుంటున్నారా.. నిజమే. అక్టోబర్ 6వ తేదీన సమంత - నాగచైతన్యల వివాహం జరుగనుంది. ఇప్పటికే పెళ్ళి పత్రికలు సిద్ధమై అక్కినేని, సమంత ఇంటికి చేరుకున్నాయి. ఇప్పటికే నాగార్జున కొన్ని షరతులను సమంతకు పెట్టారట. 
 
పెళ్ళికి ఎవరు పెడితే వారిని పిలవద్దండి.. అందరూ ప్రముఖులే వివాహానికి హాజరవుతారు. పత్రికలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి అవసరమైన వారినే పిలవాలంటూ అటు సమంతకు, ఇటు నాగచైతన్యకు చెప్పారట నాగార్జున. దీంతో సమంత సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా పెళ్ళి పత్రిక అడిగితే ఇలా చెబుతోందట. నా పెళ్ళికి రావొద్దండి.. ప్లీజ్.. ఏమీ అనుకోకండి అంటూ ముఖం మీద చెప్పేస్తోందట. అంతేకాదు ప్రత్యేక విందు ఇస్తున్నాం.. అప్పుడు కావాలంటే అందరూ రావచ్చంటూ చెప్పుకొస్తేందట.
 
పెళ్ళికాకముందే మామ నాగార్జున చెప్పిన మాటలను తూచా తప్పకుండా సమంత పాటిస్తుందంటే పెళ్ళయిన తర్వాత ఎలా ఉంటుందోనని సినీవర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇప్పటికే సమంత-నాగచైతన్యల పెళ్ళి పత్రికలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్న విషయం తెల్సిందే. 



దీనిపై మరింత చదవండి :  
Samanta Marriage Nagarjuna Naga Chaitanya

Loading comments ...

తెలుగు సినిమా

news

ఒకటి హిట్టు.. రెండు ఫట‌్టు .. టాలీవుడ్‌లో మూడు చిత్రాల సందడి

ఒకేరోజు మూడు రోజులు విడుదల. సినీ అభిమానులకే పండుగే. అందులోను బాహుబలి తరువాత రానా నటించిన ...

news

నాపై కోపమొస్తే సమంత సీరియస్‌గా చూస్తుంది.. పోట్లాట మాత్రం వుండదు: నాగచైతన్య

టాలీవుడ్ ప్రేమపక్షులు సమంత, నాగచైతన్య త్వరలో పెళ్ళి ద్వారా ఒకటి కానున్నారు. తనపై ...

news

నన్ను ఆ క్యారెక్టర్‌లోనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : 'లై' కమెడియన్ మధు(వీడియో)

ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిదే సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు కమెడియన్ ...

news

అలాంటి కథలపైనే దృష్టి పెడతా - బోయపాటి శ్రీను, ప్రగ్యా ఊపేసింది(వీడియో)

యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బోయపాటి శ్రీను. ఆయన సినిమా తీశాడంటే ఇక హిట్టవ్వాల్సిందే. ...