Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గెస్ట్‌లను ఆనందపరిచేందుకు డ్రగ్స్ ఇచ్చిన మాట నిజమే... వెల్లడించిన నవదీప్?

మంగళవారం, 25 జులై 2017 (13:08 IST)

Widgets Magazine
navdeep

తాను నిర్వహించిన ఈవెంట్ల సందర్భంగా ప్రముఖులకు వారి ఇష్టంమేరకు డ్రగ్స్‌ను సరఫరాచేశానని హీరో నవదీప్ సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఈవెంట్లు, పార్టీలు, పబ్బుల్లో డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంటాయి? అనే విషయాల్లోనూ కీలక సమాచారాన్ని బయటపెట్టినట్టు సమాచారం.
 
హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌ విచారణలో భాగంగా యువ నటుడు నవదీప్ వద్ద సిట్ అధికారులు సోమవారం 11 గంటల పాటు విచారణ జరిపిన విషయం తెల్సిందే. ఈ విచారణలో అనేక ఆధారాలు చూపెడుతూ విచారించడంతో అన్ని విషయాలను ఆయన బహిర్గతం చేసినట్టు సమాచారం. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్, బెల్జియం, థాయ్‌లాండ్‌లతో పాటు, దేశంలోని గోవా, ఊటీ, కొడైకెనాల్, ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లోనూ ప్రముఖులకు చెందిన పెద్దపెద్ద ఈవెంట్లను నిర్వహించినట్టు అంగీకరించారని తెలిసింది. 
 
సదరు ఈవెంట్లకు హాజరైన ప్రముఖులకు ప్రత్యేక సౌకర్యాలు కలుగజేసి, వారిని ఆనందపరిచేందుకు వారి ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలను అందజేశామని చెప్పినట్టు సమాచారం. డ్రగ్స్ వాడకంపై సిట్ అధికారులు వివిధ రకాల ప్రశ్నలతో నవదీప్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. డ్రగ్ మాఫియా కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన అధికారులు.. కెల్విన్ మొబైల్ కాల్‌డాటాలో నవదీప్ నంబర్ ప్రముఖంగా ఉండటాన్ని చూపి ప్రశ్నించినట్టు తెలిసింది. 
 
అలాగే, హైదరాబాద్‌లో పేరుగాంచిన బీపీఎం పబ్బులో తాను భాగస్వామిగా ఉన్నది వాస్తవమేనని ఒప్పుకున్నట్టు సమాచారం. సంపన్నులు ఆటవిడుపు కోసం వచ్చే పబ్బులు, క్లబ్బులన్నీ మత్తుకేంద్రాలుగా మారుతున్నాయని చెప్పిన నవదీప్.. పబ్ కల్చర్ నగరాలను మత్తులో ముంచేస్తున్నదని అన్నారని సమాచారం. కాగా, నవదీప్‌ వద్ద విచారణ ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ సుదీర్ఘంగా సాగి, రాత్రి 9.45 గంటలకు ముగిసింది. అతడి రక్తనమూనాలతో పాటు, వెంట్రుకలు, గోర్లు సేకరించడానికి అనుమతి కోరారు. దీనికి నవదీప్ నిరాకరించడంతో ఎలాంటి నమూనాలను సేకరించలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మొత్తం టాలీవుడ్‌నే బోనులో పెడతారా.. ఏడుపొస్తోందన్న నారాయణమూర్తి

కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తే మొత్తం తెలుగు చిత్రపరిశ్రమనే బద్నామ్ ...

news

మూడు రోజుల్లో 25 కోట్లు.. లాభం 10 కోట్లు.. దిల్ రాజు పంట పడించిన 'ఫిదా' సాయి పల్లవి

బాహుబలి 2 సినిమా తొలిరోజు కలెక్ష్లన్లు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు అయితే తెలుగు ...

news

సాయి పల్లవి నటనకు ప్రవాసీలు 'ఫిదా'.. కలెక్షన్ల వర్షం...

భానుమతిగా తెలంగాణ యాసలో సాయి పల్లవి నటనకు తెలుగు వారే కాదు.. ప్రవాసీలు కూడా 'ఫిదా' ...

news

మత్తు దందాలో ఇరికిస్తారని భయమేస్తోంది... బోరున విలపిస్తున్న చార్మీ

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో తనను ఇరికిస్తారనే భయం పట్టుకుందని సినీ నటి ...

Widgets Magazine