సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : ఆదివారం, 25 నవంబరు 2018 (12:13 IST)

'RRR'లో ఈషా రెబ్బా..? రాజమౌళి నవ్వుకుంటున్నారట...

ట్రిపుల్ ఆర్‌పై వస్తున్న వార్తలు విని దర్శక ధీరుడు రాజమౌళి నవ్వుకుంటున్నారట. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ట్రిపుల్ సినిమాలో ఈషా రెబ్బ నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలు విని.. జక్కన్న తెగ నవ్వుకుంటున్నారట. ట్రిపుల్ ఆర్‌లో కన్నడ నటుడు యాష్ మెయిన్ విలన్ రోల్ అని గతంలో కథనాలు వెలువడ్డాయి. 
 
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మేడ్ చేసిన పోస్టర్లు చాలానే దర్శనమిస్తున్నాయి. కానీ ఇవన్నీ రూమర్సేనని తెలిసింది. ఇకపోతే.. తాజాగా ఈషారెబ్బ ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరి అంటూ టాక్ మొదలైంది. అరవింద సమేతలో అమ్మడు తారక్ మరదలిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్‌లో నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది.