ప్రభాస్ సలార్ పై ఫస్ట్ రివ్యూ బాలీవుడ్ సెన్సార్ నుంచి వచ్చేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా సలార్ పై అభిమానుల్లోనూ, ప్రేక్షకులలోనూ చాలా గందరగోళం నెలకొంది. ఇంతకుముందు రిలీజ్ అయిన ప్రభాస్ సినిమాలు ఏవీ పెద్దగా ఆడలేదు. అందుకే ప్రమోషన్ కూడా ఈసారి పెద్దగా చేయడంలేదని టాక్ తెలుగు సినిమా రంగంలో నెలకొంది పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇతర దేశ భాషల్లోనూ విడుదలవుతుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కు విదేశీ ఫ్యాన్స్ పెరిగారు.
అయితే ఇదంతా సలార్ కు ఉపయోగపడుతుందా? అనే ప్రశ్న చాలామందిలో వుంది. మరో వైపు రాజమౌళి సాలార్ మొదటి టికెట్ కొనడంతో సినిమా పై హైప్ పెరిగింది.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ లోనూ ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? అన్న పాయింట్ ఇందులో కనిపించింది. మరోవైపు ప్రశాంత్ నీల్ తాను గతంలో తీసిన కె.జి.ఎఫ్. తరహాలో ఈ సినిమా తీశాడని అర్థమవుతుంది. కానీ వీటన్నింటికీ ట్విస్ట్ ఇస్తూ, బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సంధు ఓ ట్వీట్ చేశాడు.
·
సెన్సార్ నుంచి వచ్చిన రివ్యూగా ఉమైర్ సంధు పేర్కొంటూ.. ఫస్ట్ రివ్యూ సాలార్ : ఇది మూడు ఏస్‌లతో ఫుల్ ఎంటర్‌టైనర్ - ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా, స్టైలిష్ యాక్షన్ మరియు సూపర్ BGM సంగీతం. అతనికి ఉత్తమ పునరాగమన చిత్రం. మాస్‌తో ఆడుకునే విషయంలో ఆయనే బాస్. అతనిని నిరూపించుకోవడానికి ఈ పాత్ర చాలా అవకాశాలను అందిస్తుంది అన్నారు. గతంలో బాహుబలికి కూడా ఆయన మొదటి రివ్యూ ఇచ్చాడు.
హోంబలే ఫిలిమ్స్ నుంచి భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
అందుకు తగినట్లుగానే పలు చోట్ల ప్రభాస్ భారీ కటౌట్ ను పెట్టేశారు. ఇంతకుముందు ప్రభాస్ పుట్టినరోజు నాడు హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ మైదానంలో భారీ కటౌట్ పెట్టారు. ఇప్పుడు థియేటర్లు వున్న షాపింగ్ మాల్స్ దగ్గర పెట్టారు.