శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 9 సెప్టెంబరు 2019 (22:12 IST)

అక్కినేని వారి మ‌నం స్టైల్లో ఘ‌ట్ట‌మ‌నేని మ‌నం... ఇంత‌కీ ద‌ర్శ‌కుడు ఎవ‌రు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - స‌క్స‌స్‌ఫుల్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందిన మ‌హ‌ర్షి స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఆక‌ట్టుకోవ‌డంతో పాటు మంచి సినిమాగా ఆద‌ర‌ణ పొంద‌డంతో మ‌హేష్... వంశీ పైడిప‌ల్లితో మ‌రో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేయ‌నున్నాడు అని తెలిసింది.
 
అయితే... ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టించిన తెలుగు చిత్రం మ‌నం. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ అంద‌రూ ఇందులో న‌టించారు. ఈ మూవీ.. మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టించిన సెకండ్ ఇండియ‌న్ మూవీ కావ‌డం విశేషం. అయితే ఇప్పుడు హీరో మ‌హేష్ అలాంటి ప్ర‌యోగానికి తెర తీశార‌ట‌. 
 
సూప‌ర్‌స్టార్ మ‌హేష్, ఆయ‌న త‌న‌యుడు గౌత‌మ్ కల‌యిక‌లో ఓ సినిమా రూపొంద‌నుందట‌. ఇందులో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అంటే ఘ‌ట్ట‌మ‌నేని మూడు త‌రాల ఫ్యామిలీ హీరోలు క‌లిసి న‌టించే సినిమాగా తెర‌కెక్క‌నుంద‌ట‌. ఈ భారీ క్రేజీ మూవీని వంశీ పైడిప‌ల్లి డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి స్క్రిప్ట్‌ను తయారు చేస్తున్నాడ‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే అభిమానుల‌కు పండ‌గే.