మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : గురువారం, 22 మార్చి 2018 (08:56 IST)

భారత సినిమాలకు బై బై చెప్పేయనున్న నటి.. ఎవరు?

భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్

భారత సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు ఓ ప్రముఖ నటి సిద్ధమవుతోంది. ఆమె ఎవరో తెలుసా? అమీ జాక్సన్. ఇంగ్లండ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ.. దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రెండుసార్లు నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ''2.0'' నటించినా అవకాశాలు వెతుక్కుంటూ రాకపోవడంతో ఇక ఇండియన్ సినిమాలు చాలునని అమీ జాక్సన్ నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ''ఐ''లో కనిపించిన అమీ, రజనీకాంత్ సరసన 2.0 సినిమాలో చేస్తోంది. ఈ చిత్రం విడుదలైతే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని భావించిందట. కానీ ఈ సినిమా విడుదల వాయిదా వేసుకుంటూ పోవడంతో అమీ జాక్సన్ నిరాశ చెందిందట. దీంతో , ఇండియన్ మూవీస్ కు గుడ్ బై చెప్పి, ఆఫ్రికా దేశంలోని మొరాకో నగరంలో సెటిల్ కావాలనుకుంటోందట. అయితే ఈ వార్తలపై అమీ జాక్సన్ ఇంకా స్పందించలేదు.