శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Updated : గురువారం, 21 ఆగస్టు 2014 (14:07 IST)

హన్సిక ఐస్ బకెట్ గుమ్మరించుకుని ఛాలెంజ్... (వీడియో)

హన్సికలో వేడి ఎంతమేరకు ఉందో... అయ్యబాబోయ్ అంటున్నారు కోలీవుడ్ సినీజనం. ఇంతకీ విషయం ఏంటయా అంటే హన్సికకు బకెట్ నిండుగా ఐస్ తీసుకుని అందరూ చూస్తుండగా తలపై గుమ్మరించుకుని కనీసం గజగజ అని కూడా వణకలేదట. అలా ఐసు ముక్కలను మీద గుమ్మరించుకుని కూల్ గా కూర్చుని ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసిందట. 
 
ఈ ఇంటర్వ్యూలో శింబు పేరెత్తకున్నా... కొన్ని పరిచయాల అనుభవాలు గురించి చెబితే అవతలివాళ్లు ఏమైపోతారో చెప్పలేం. అందుకని సైలెంటుగా ఉంటే వారికి మేలు జరుగుతుంది. ఐనా అలాంటి పరిచయాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదంటూ వేదాంతం చెప్పుకొచ్చిందట. ఇంతకీ పరిచయం వెనుక ఏం జరిగిందన్నది మాత్రం వివరించలేదట.
 
ఇక ఐస్ బకెట్ గుమ్మరింపుపై మాట్లాడితే... ఇదేదో పెద్ద గొప్ప అని అందరూ అంటున్నారు. అందుకే అది ఎంత గొప్పదో గుమ్మరించుకుని చూపించాను అంటూ ఫోజుగా చెపుతోందట. హన్సిక అలా తలపై ఐసు ముక్కలను గుమ్మరించుకోవడానికి శింబు కారణమంటూ కొందరు గుసగుసలాడుతున్నారు.
 
యూ ట్యూబ్ వీడియో లుక్కేయండి....