Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్.. విమర్శించడానికి మీరెవరు : హరీష్ శంకర్

మంగళవారం, 27 జూన్ 2017 (13:18 IST)

Widgets Magazine
harish shankar

"నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్‌టైనర్ వస్తే, రెవెన్యూలు చూడాలి కానీ, రివ్యూలు కాదు. నన్ను విమర్శించడానికి మీరెవరు?" అంటూ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ మండిపడ్డారు. 
 
ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం 'దువ్వాడ జగన్నాథం'. ఈ చిత్రం ఈనెల 23వ తేదీన రిలీజ్ అయింది. ఈ చిత్రం రివ్యూను ఒక్కో వెబ్‌సైట్ ఒక్కోవిధంగా రాసింది. వీటిపై ఆయన స్పందిస్తూ "ఎవరి విమర్శలకూ నేను సమాధానం చెప్పను. నా తీరే ఇంత. నాకు కళ్లు నెత్తికెక్కాయనడానికి మీరెవరు? అని ప్రశ్నించాడు. 
 
డీజే చిత్రంపై తొలి రోజున మిశ్రమ రివ్యూలు వచ్చాయి. కొన్ని వెబ్‌సైట్లు సినిమా ఘోరమని కూడా వ్యాఖ్యానించగా, కలెక్షన్ల విషయంలో మాత్రం చిత్రం రూ.100 కోట్ల దిశగా దూసుకెళుతోంది. ఈనేపథ్యంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి. 
 
ఇకపోతే డీజే మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ లీక్ చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. పైరసీలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ హెచ్చరించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారిన మహేష్ బాబు.. ఏకంగా ఏడో స్థానానికి?

స్పైడర్ హీరో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టు నుంచి దిగజారాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ ...

news

డైరెక్టర్ చెపితే విప్పేస్తానంటున్న పూజా హెగ్డే... పర్సనల్ టచ్...

తెలుగు వెండితెరపై 'ఒక లైలా కోసం' చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'ముకుంద'తో మంచి ...

news

నటజీవితం తొలిరోజుల్లో ఆకలితో అలమటించా: రకుల్ ప్రీత్ ఆవేదన

పంజాబీ అమ్మాయే అయినా తెలుగువారికంటే బాగా తెలుగు మాట్లాడే అద్భుత హీరోయిన్ ఆమె. ఇప్పుడంటే ...

news

తీసిన సినిమాలు ఎన్నిసార్లు తీస్తావు "హరీష్ శంకరా"???

హరీష్ శంకర్ ఎంత ఎనర్జీ ఉన్న డైరెక్టరో అందరికీ తెలిసిందే.. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో ...

Widgets Magazine