శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2017 (11:00 IST)

నా సినిమా ఫ్లాప్ అయితే ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుస్తూనే వుంటా..

తాను చేసిన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే వుంటానని హీరోయిన్ హెబ్బా పటేల్ వెల్లడించింది. ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' హిట్ తర్వాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయం పా

తాను చేసిన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏడుస్తూనే వుంటానని హీరోయిన్ హెబ్బా పటేల్ వెల్లడించింది. ''ఎక్కడికి పోతావు చిన్నవాడా'' హిట్ తర్వాత తాను చేసిన రెండు సినిమాలు పరాజయం పాలవడంతో.. మళ్లీ ఓ మంచి హిట్ కోసం హెబ్బా పటేల్ ఆత్రుతతో ఎదురుచూస్తోంది. అలాంటి హిట్‌ను అందిస్తుందనే నమ్మకంతోనే తాజాగా హెబ్బా పటేల్ ఏంజెల్ చిత్రంలో కనిపిస్తోంది. 
 
ఈ సినిమాపై హెబ్బా పటేల్ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ఎవరైనా సరే హిట్ అవుతుందనే ఉద్దేశంతోనే ఏ సినిమా అయినా చేస్తారు. అదే ఫ్లాప్ అయితే ఎలా స్పందిస్తారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాత్రంతా ఏడుస్తూనే వుంటానని తెలిపింది. రెండవ రోజుకి కొంత తేరుకుంటాననీ, ఎప్పుడూ సక్సెస్‌లు .. పరాజయాలే రావుకదా అని మనసుకు సర్ది చెప్పుకుంటానని అంది. ఆ తరువాత తదుపరి మూవీపై దృష్టి పెడతానని చెప్పుకొచ్చింది.