శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 20 జులై 2017 (14:07 IST)

పూరీకి డ్రగ్స్ నిజనిర్ధారణ టెస్టులు.. పరీక్ష కోసం వెంట్రుకలు.. రక్తం... ఇంకా...

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం 11 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కూడా సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) బుధవారం 11 గంటల పాటు విచారించింది. ఈ విచారణలో డ్రగ్స్‌ వాడకం, డ్రగ్స్ ముఠా నేత కెల్విన్‌తో పరిచయం, ఫోను సంభాషణలు ఇలా ప్రతి ఒక్క అంశంపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.
 
అంతేకాకుండా, విచారణ ముగిసిన తర్వాత పూరీ జగన్నాథ్ డ్రగ్స్ తీసుకున్నాడో లేదో నిజనిర్ధారణ చేసేందుకు వీలుగా ఆయన రకం శాంపిల్స్, వెంట్రుకలు, చేతి గోళ్లను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు సేకరించి ఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు.
 
దీనిపై ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంఓ రఫీ మాట్లాడుతూ... పూరీ జగన్నాథ్కు చెందిన 50 తల వెంట్రుకలు, కాళ్లు, చేతి వేళ్ళ గోర్లు నమూనాలను తాము సేకరించామని, వీటితో పాటు 5 మిల్లీ లీటర్ల రక్తాన్ని ఆయన అనుమతితోనే తీసుకున్నట్టు తెలిపారు. ఈ శాంపిల్స్‌ను ఎఫ్ఎస్ఎల్‌కు పంపామని రఫీ తెలిపారు. ఆయన డ్రగ్స్ తీసుకున్నారో లేదోనన్న విషయం పరీక్షల నివేదిక తర్వాత వెలుగులోకి వస్తుందని అన్నారు.