ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 2 మార్చి 2024 (19:19 IST)

కాలేజీ రోజుల్లో నాకు ప్రేమికుడు వున్నాడు: సమంత

Samantha
సమంత. ఈమె గురించి సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూ వుంటుంది. ఈమధ్య ఆమె ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అదేంటో తెలుసుకుందాము.
 
కాలేజీ రోజుల్లో సమంత చెన్నైలో పల్లవరం నుంచి రెండు బస్సులు మారి వెళుతూ వుండేదట. చెన్నై టి.నగర్ వెళ్లడానికి బస్సులో 2 గంటలు పట్టేదట. ఆ సమయంలో ఆమెను ఓ కుర్రవాడు ఫాలో అయ్యేవాడట. అతడు అలా రెండేళ్లు ఫాలో అవుతూనే వున్నాడట. ఐతే సమంతతో ఒక్క మాట మాట్లాడేవాడు కాదట.
 
రోజూ సమంత కోసం బస్సు స్టాపులో వెయిట్ చేసేవాడట. సమంత రాగానే ఆమె ఎక్కిన బస్సు ఎక్కి ఫాలో అయ్యేవాడట. అలా రెండేళ్లు కాలేజీ చదువు ముగిసాక చివరికి నేరుగా అతడి వద్దకు సమంత వెళ్లిందట. తనను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే... నేనేమీ మిమ్మల్ని ఫాలో అవడం లేదని సింపుల్‌గా చెప్పేశాడట. దాంతో సమంతకు ఫ్యూజులు ఎగిరిపోయాయట. ఐతే అతడే తన ఫస్ట్ లవర్ అంటూ చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.