సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Srinivas
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (12:01 IST)

గోళ్లు గిల్లుకుంటున్న అను ఇమ్మాన్యుయేల్ ... ఎందుకు?

అను ఇమ్మాన్యుయేల్. ఈమె గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్‌ను ఐరన్ లెగ్ అంటున్నారు. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అంటున్నారు. అజ్జాతవాసి, నా పేరు స

అను ఇమ్మాన్యుయేల్. ఈమె గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్‌ను ఐరన్ లెగ్ అంటున్నారు. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అంటున్నారు. అజ్జాతవాసి, నా పేరు సూర్య సినిమాలే కాకుండా అంతకుముందు తీసిన సినిమాలు చాలా ఫెయిలైపోయాయి. ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ ఫెయిలవుతున్నాయి.
 
కథ బాగున్నా.. అగ్ర హీరోలున్నప్పటికీ అను ఇమ్మాన్యుయేల్ నటిస్తే చాలు ఆ సినిమాకు ఫ్లాప్ అనే ముద్ర పడిపోతోంది. అందుకే రవితేజ సినిమాలో అను ఇమ్మానుయేల్‌ను ముందుగా అనుకుని సెట్స్‌ పైకి వెళ్ళిందే ఆ సినిమా నుంచి ఆమెను తొలగించారు. అంతకుముందు సినిమాల్లోనూ అనును తీసుకుని ఆపై వద్దనుకుని పక్కనబెట్టేశారని టాక్ వస్తోంది. దీంతో అను ఇమ్మాన్యుయేల్  ఏం చేయాలో అర్థం కాక స్నేహితులకు చెప్పి ఏడుస్తూ కూర్చొందట. 
 
కాగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ''అమర్ అక్బర్ ఆంటోనీ''. ఈ సినిమా నుంచి డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల అను ఇమ్మాన్యుయేల్ తప్పుకున్న సంగతి తెలిసిందే.