బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 16 ఆగస్టు 2021 (22:59 IST)

అభిమానుల సందేశాలను చూసి ఇలియానా నవ్వుకుంటోందట...

ఇలియానా. ఈమె పేరు వింటేనే ఠక్కున పోకిరి సినిమా గుర్తుకొస్తుంది. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. జీరో సైజ్ నడుముతో ఇలియానా సినిమాలో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
 
యువతను మత్తెక్కించేలా ఇలియానా ఎంతో అద్భుతంగా నటించారు. తెలుగు భాష తెలియకపోయినా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇలియానాకు అవకాశమిచ్చారు. హీరో మహేష్ బాబుకు ఎంత పేరు వచ్చిందో ఇలియానాకు అదే విధంగా ఈ సినిమాలో పేరు వచ్చింది.
 
ఆ ఒక్క సినిమా హిట్‌తో బాలీవుడ్ వైపు వెళ్లిన ఇలియానా అక్కడ చివరకు అవకాశాలు తక్కువై మళ్లీ టాలీవుడ్ వైపు చూసింది. ప్రస్తుతం వయసుపైబడిన ఇలియానాకు అవకాశాలు అసలు రావడం లేదు. కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు వయసుపైబడిన హీరోయిన్లను దర్శకులు నిర్మాతలు అసలు పట్టించుకోవడం లేదు.
 
ఆ కోవలోకి ఇలియానా కూడా చేరుకుంది. అయితే చేతిలో సినిమాలు లేకపోయినా ఇలియానా మాత్రం తన అందాన్ని తరగవ్వకుండా అలాగే కాపాడుకుంటోంది. జీరో సైజ్ నడుముతో ముఖంలో ఎలాంటి మచ్చలు, ముడతలు లేకుండా జాగ్రత్త పడుతోంది ఇలియానా.
 
అంగాంగ ప్రదర్శన చేస్తూ ఆ వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తోంది. అభిమానుల సందేశాలను చూస్తూ నవ్వుకుంటోంది. అవకాశాలు ఎప్పుడైనా వస్తాయి నాకు అభిమానులు ముఖ్యం..అంటూ సందేశాలు పంపుతోందట ఇలియానా.