శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (18:57 IST)

నితిన్‌కి నో చెప్పిన ఇలియానా? ఎందుకు? (video)

గోవా బ్యూటీ ఇలియానా... టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత బాలీవుడ్‌పై కాన్‌సన్‌ట్రేషన్ చేసి టాలీవుడ్‌కి దూరమైంది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్లో సినిమాలు చేయాలనుకుంటుంది. మాస్ మహా రాజా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. అయితే... ఈ సినిమా సక్సస్ సాధించకపోవడంతో మళ్లీ అవకాశాలు రాలేదు.
 
ఇక ఇలియాన పని అయిపోయింది అనుకున్నారు. తాజా వార్త ఏంటంటే... ఓ మాంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఇలియానాకి యువ హీరో నితిన్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది.
 
ఇలాంటి టైమ్‌లో ఎవరైనా వెంటనే ఓకే చెబుతారు కానీ.. ఇలియానా నో చెప్పింది. ఇంతకీ విషయం ఏంటంటే.... నితిన్ బాలీవుడ్లో సక్సెస్ సాధించిన అంధాధూన్ సినిమాని రీమేక్ చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. ఇందులో నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ ఉంది. హిందీలో ఆ పాత్రను టబు చేసింది. ఈ పాత్ర కోసం ఇలియానాని సంప్రదిస్తే... మరో మాట లేకుండా నో చెప్పేసిందిట. కారణం ఏంటంటే... నెగిటివ్ రోల్ చేయడం ఇష్టం లేదని చెప్పిందట.

ఇలియానా ఈ సినిమా చేసుంటే ఖచ్చితంగా ఆమె కెరీర్‌కి ప్లస్ అయ్యేది కానీ.. అలా చేయలేదు. మరి.. ఇలియానా కోరుకున్నట్టుగా కెరీర్లో మళ్లీ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుందో..?