శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By PNR
Last Updated : బుధవారం, 17 సెప్టెంబరు 2014 (12:49 IST)

ఇలియానా జాక్‌పాట్: వామ్మో.. ఒకేసారి ఖాన్‌లతో 3 సినిమాలు!!

ఇలియానా బాలీవుడ్‌లో జాక్ పాట్ కొట్టేసింది. టాలీవుడ్‌లో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ ఒకేసారి మూడు సినిమాల్లో సంతకం చేసేసినట్లు సమాచారం. పైగా, ఈ మూడూ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో కావడం విశేషం. దీంతో ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం మాంచి జోష్ మీదుంది.
 
యష్ రాజ్ ఫిలిమ్స్ షారుఖ్ ఖాన్‌తో నిర్మించే సినిమాలో ఈమెను ఇటీవలే ఎంచుకున్నారు. అలాగే, పనిలో పనిగా రెండో సినిమాకు కూడా బుక్ చేసేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. 
 
షారుఖ్ సినిమా పూర్తయ్యాక ఆ సంస్థ రణభీర్ కపూర్‌తో ఓ సినిమాను ఈ గోవా బ్యూటీ ప్లాన్ చేస్తోంది. దాని తర్వాత సల్మాన్ ఖాన్‌తో మరో ప్రాజక్టు లైన్లో వుంది. ఈ రెండింటిలోనూ కూడా మన సన్నజాజి సుందరే కథానాయికగా నటిస్తుందట. ఇంకేముంది.. ఇలియానా బాలీవుడ్‌లో పండగ చేసుకోనుందన్నమాట.