మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 జులై 2022 (10:47 IST)

ఇలియానాకు- పూజా హెగ్డేకు కలిసిరాని కోలీవుడ్?

Ileana
టాలీవుడ్ నడుము సుందరి ఇలియానాను పూజా హెగ్డే తలపిస్తోంది. కేడీ చిత్రంతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్ర అపజయంతో ఆ తరువాత ఆమెను పక్కన పెట్టేశారు. టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న ఈమెకు కోలీవుడ్ కలిసిరాలేదు. 
 
బాలీవుడ్‌లోనూ సల్మాన్‌ ఖాన్, రణవీర్‌సింగ్‌ వంటి స్టార్‌ హీరోలతో జతకట్టి మరోసారి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అయితే కోలీవుడ్‌లో మాత్రం సరైన విజయం దక్కలేదు. నిజానికి పూజా తమిళ చిత్రంతోనే సినీరంగ ప్రవేశం చేసింది. 
pooja hegde
పూజా హెగ్దె
 
10 ఏళ్ల క్రితం ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. దీంతో పూజా హెగ్డేను అక్కడ పట్టించుకోలేదు. చాలా గ్యాప్‌ తరువాత ఇటీవల బీస్ట్‌ చిత్రంలో విజయ్‌తో నటించినా లక్‌ కలిసి రాలేదు
 
ఇదే తరహాలో ఇలియానా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. కోలీవుడ్ ఆమెకు కలిసి రాలేదు. విజయ్‌ సరసన నన్భన్‌ చిత్రంతో రీఎంట్రీ అయ్యింది. 
 
అయితే ఆ చిత్రం మిశ్రమ స్పందనను పొందడంతో ఇలియానా ఇక్కడ కనిపించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తాజాగా సూర్య సరసన నటించే మరో లక్కీచాన్స్‌ కొట్టేసిందనే టాక్‌ వినిపిస్తోంది