ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (14:08 IST)

ఇండియన్-2: కమల్‌ హాసన్‌కి మొగుడిగా ఖుషీ దర్శకుడు?

Pawan_Sj Surya
సినీ లెజెండ్ కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇండియన్‌ పార్ట్1లో కమల్ నటనతో పాటు సమాజానికి సందేశాన్నిచ్చిన శంకర్.. ఈ సినిమా రెండో భాగంలో ఎలాంటి మెసేజ్‌తో రిలీజ్ చేస్తాడనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 
 
ఇక ఈ చిత్రంలో కమల్‌తో పాటు సముద్రఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రాహుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 
లైకా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయుడు-2లో కమల్‌కు విలన్‌గా నటుడు, దర్శకుడు ఎస్‌జె సూర్యను చిత్రబృందం ఎంపిక చేసినట్లు సమాచారం. 
 
ఎస్‌జే సూర్య ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు ఖుషీ దర్శకుడైన ఎస్‌జే సూర్య మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలోనూ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇంకా కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రతినాయకుడి పాత్రలతో పాటు కీలక క్యారెక్టర్ రోల్స్ ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి.