'సారా'లో సాక్షి అగర్వాల్ అందాల కవ్వింత, కిక్కెక్కిస్తానంటున్న బ్యూటీ
తమిళ బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన బ్యూటీ సాక్షి అగర్వాల్. సోషల్ మీడియా ద్వారా తనను తను ప్రమోట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది ఈ భామ. అవకాశం దొరికినప్పుడల్లా తన అందంతో అభిమానులపై విరుచుకుపడుతుంది. కొత్త ఫోజులతో కవ్విస్తుంది. అమ్మడి కవ్వింపులకు బీభత్సమైన క్రేజ్ రావడంతో ఆమెకి వరుస ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయి.
తమిళంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 'సారా'లో నటిస్తోంది. అంతేకాదు తెలుగులో అతిథి 2 చిత్రంలో ఆఫర్ కొట్టేసింది. ప్రస్తుతం దక్షిణాదిలో అరడజనుకి పైగా చిత్రాల్లో నటిస్తూ విమానాల్లో చక్కెర్లు కొడుతోంది. అంతేకాదు, నటనకు అవకాశమున్న పాత్రలను చేయడంతో పాటు గ్లామర్ షోను కూడా కావల్సినంత చేస్తానని అంటోందట. ఆ ఒక్క మాటకి సంతృప్తి చెందుతున్న నిర్మాతలు వరుస ఆఫర్లు ఇచ్చేందుకు సాక్షిని సంప్రదిస్తున్నారట.