రవితేజ - రానా ఆ డైరెక్టర్‌కి అవకాశం ఇచ్చారా..?
మలయాళంలో సక్సస్ సాధించిన అయ్యప్పన్ కోషియమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో నందమూరి నట సింహం బాలకృష్ణ నటించనున్నారని.. మరో హీరోగా రానా అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలయ్య ఇంట్రస్ట్ చూపించడం లేదు.. విక్టరీ వెంకటేష్‌తో ఆ పాత్రను చేయించాలనుకుంటున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది.
ఆ తర్వాత వెంకటేష్ కాదని.. ఆ పాత్ర కోసం రవితేజను అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఇది నిజమో కాదో అనుకున్నారు కానీ.. తీరా ఆరా తీస్తే.. నిజమే అని తెలిసింది. రవితేజ - రానా కాంబినేషన్లో మూవీ. సురేష్ ప్రొడక్షన్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మించనున్నాయి. అంతా బాగానే ఉంది మరి.. డైరెక్టర్ ఎవరు అంటే కొంతమంది పేర్లు తెర పైకి వచ్చాయి.
అయితే.... ఫైనల్‌గా ఎవరూ ఊహించని డైరెక్టర్‌కి ఛాన్స్ ఇస్తున్నారని సమాచారం. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే... అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు చిత్రాలు తెరకెక్కించిన సాగర్ చంద్ర. ఆల్రెడీ సాగర్ చంద్రను ఓకే చేయడం.. సాగర్ చంద్ర స్ర్కిప్టులో మార్పులు చేయడం కూడా జరిగిందని తెలిసింది. మరి... ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే.. సాగర్ చంద్రకు భారీ ఆఫర్స్ రావడం ఖాయం.