బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (16:50 IST)

సంచలన నిర్ణయం తీసుకున్న అమితాబ్!!

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమాల్లో నటించబోనంటూ రిటైర్మెంట్ ప్రకటించారు. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తన పర్సనల్ బ్లాగ్‌లో వెల్లడించారు. 
 
ప్రస్తుతం అలియా భట్, రణబీర్ కపూర్‌‌ల కొత్త మూవీ “బ్రహ్మాస్త్ర” షూటింగ్ కోసం మనాలికి వెళ్లిన అమితాబ్, తన బ్లాగ్‌లో… 'శరీరం విశ్రాంతి కోరుకుంటుందని, ఇన్నాళ్ల పాటు గడిపిన సినీ వాతావరణంకాకుండా.. మరొక కొత్త వాతావరణాన్ని మనసు కోరుకుంటుందని' అని తెలిపారు. 
 
పదవీ విరమణ చేయాల్సిన సమయమిదని అన్నారు. తల ఒకటి ఆలోచిస్తుంటే.. వేళ్లు మరొకటి ఆలోచిస్తున్నాయని అన్నారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందలకొద్దీ సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అమితాబ్. తన నట ప్రస్థానంలో నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంతో పాటు మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు.