శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జులై 2023 (12:38 IST)

ఒక్క సినిమాకు రూ.2కోట్లు డిమాండ్ చేస్తోన్న మృణాల్ ఠాకూర్?

mrunal thakur
2014లో బుల్లితెర నుంచి సినిమాల్లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా స్థిరపడింది. టాలీవుడ్ మృణాల్ ఠాకూర్‌కు సీతారామం చిత్రంతో భారీ హిట్ ఇచ్చింది. సీతగా ఆమె నటన అద్భుతం. తాజాగా మృణాల్ ఠాకూర్ తన రెమ్యునరేషన్ పెంచింది. 
 
సీతారామం సినిమా సక్సెస్ తర్వాత మృణాల్ ఠాకూర్ తన రెమ్యునరేషన్‌ని భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోంది. 
 
ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ "లస్ట్ స్టోరీస్-2"లో కనిపించారు. ఆమె చేతిలో మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో నాని 30వ సినిమాలో కూడా ఆమె కనిపించనుంది. 
 
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. మృణాల్ ఠాకూర్‌కు 2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
 
త్వరలో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఆమె శివకార్తికేయన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.