శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శనివారం, 2 నవంబరు 2019 (21:13 IST)

అక్కినేని కుటుంబంలో శుభవార్త, సమంత ఇక సినిమాలకు దూరం, ఎందుకంటే?

అక్కినేని కుటుంబంలో శుభావార్త ఏంటి? సమంత ఇక సినిమాలకు దూరమవ్వడమేంటని తికమకపడుతున్నారా. రెండింటికి లింకు ఉందండి. అక్కినేని కుటుంబంలో వారసులు రాబోతున్నారు. అది కూడా సమంత-నాగచైతన్య జంటకు. చాలాకాలం తరువాత సమంత ప్రెగ్నెంట్ అయ్యిందట. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో ఇదే పెద్ద పండుగ.
 
అక్కినేని నాగార్జునకు విషయం తెలియగానే ఎగిరి గంతేశారట. నాన్న మళ్ళీ పుడుతారని నాగార్జున సమంతతో అన్నారట. మా నాన్న నాగేశ్వరరావు పుట్టాలి సమంతా అంటూ ఆమె నుదుటిపై ముద్దు పెట్టారట నాగార్జున. అయితే నాగచైతన్య మాత్రం అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఫర్వాలేదు.. ఎవరైనా ఒకటే అన్నాడట.
 
దీంతో అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారట. సమంతకు ఇప్పుడు మొదటి నెలట. మరో ఎనిమిది నెలల్లో పండంటి బిడ్డకు సమంత జన్మనివ్వబోతోంది. ప్రెగ్నెంటుగా ఉండటంతో సినిమాలకు దూరంగా ఉండాలని నాగార్జున సూచించారట. సమంత కూడా అందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.