బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 మార్చి 2024 (11:07 IST)

"విశ్వంభర"లో త్రిష డుయెల్ రోల్.. నిజమేనా?

Trisha
చెన్నై చంద్రం త్రిష ఇటీవలే "విశ్వంభర షూటింగ్‌లో చేరింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో జతకట్టింది. గతంలో మురుగదాస్‌ దర్శకత్వంలో చిరంజీవి సరసన స్టాలిన్‌ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె "విశ్వంభర"లో హీరోయిన్‌గా అదరగొట్టనుంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కూడా నటిస్తున్నారు. 
 
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో త్రిష ద్విపాత్రాభియనం చేస్తున్నట్లు సమాచారం. కథ ప్రకారం ఆమె తల్లి, కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే అందులో నిజం లేనట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్ట్ ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేస్తున్న విధానం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఒక పాట చిత్రీకరణ పూర్తయ్యింది. చిరంజీవి, త్రిషపై రెండో పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. ఇందుకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.