శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (17:05 IST)

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'ఖైదీ నంబర్ 150' : రామ్ చరణ్‌కు ముచ్చెమటలు

దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే రూ.వంద కోట్లు గ్రాస్ షేర్ వసూలు చేసిన చిత్రంగా రికార్డుపుటలెక్కింది. దీంతో ఆ చిత్రం నిర్మ

దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం విడుదలైన అతి కొద్ది రోజుల్లోనే రూ.వంద కోట్లు గ్రాస్ షేర్ వసూలు చేసిన చిత్రంగా రికార్డుపుటలెక్కింది. దీంతో ఆ చిత్రం నిర్మాత, యువ హీరో రామ్ చరణ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయట. దీనికి కారణం లేకపోలేదు. 
 
బాలకృష్ణ హీరోగా, క్రిష్ దర్శకత్వంలో వచ్చిన "గౌతమీపుత్రశాతకర్ణి" చిత్రం విషయానికి వస్తే.. ఈ చిత్రం దర్శకుడితో పాటు.. నిర్మాత, పంపిణీదారుల గృహాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 
 
నిజానికి తొలి వీకెండ్ కలెక్షన్స్ ఫలానా అంటూ 'ఖైదీ నం.150' నిర్మాణ వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశాయి. రూ.వంద కోట్ల గ్రాస్ కొట్టిన ఖైదీ అంటూ ఆ తర్వాత మెగా మూవీ కలెక్షన్స్‌పై మీడియా కూడా మోతెక్కించింది. కానీ, 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి సంబంధించిన కలెక్షన్లను ఇప్పటివరకు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించలేదు. 
 
అయినప్పటికీ.. ఐటీ అధికారులు 'గౌతమీపుత్ర శాతకర్ణి' దర్శకుడు, నిర్మాత, పంపిణీదారులను టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో.. స్వయంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్టు మెగా ఫ్యామిలీ ప్రకటించింది. దీంతో ఖైదీ చిత్రం నిర్మాత రామ్ చరణ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయట. తమ ఇళ్ళపై ఐటీ అధికారులు ఎపుడైనా సోదాలు చేయవచ్చన్న భావనతో చెర్రీ అప్రమత్తమయ్యారట.