శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (17:36 IST)

హైపర్ ఆది, అనసూయ లేని జబర్దస్త్ షోను చూస్తారా..?

హైపర్ ఆది, అనసూయ లేని జబర్దస్త్ షోను చూస్తారా.. అనే డౌట్ వచ్చేసింది. జబర్దస్త్ షోపై ఎన్ని విమర్శలు వచ్చినా కామెడీ పరంగా స్కిట్లు అదిరిపోవడంతో.. ఆ షోకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కానీ తాజాగా ఆ షోను చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందా అనే డౌట్ తలెత్తింది. ఇందుకు కారణం హైపర్ ఆది, యాంకర్ అనసూయ జబర్దస్త్‌కు దూరం కావడమే. 
 
తన గ్లామర్ టచ్‌తో షోపై ఆసక్తి క్రియేట్ చేసే అనసూయ లేకపోవడం.. అలాగే అనసూయపై హైపర్ ఆది వేసే పంచ్‌లు షోకి హైలైట్‌గా నిలిచేవి. అలాంటి షోలో ఈ ఇద్దరు మిస్ కావడంతో ఈ కార్యక్రమాన్ని జనాలు చూస్తారా అని నెట్టింట చర్చ సాగుతోంది. అనసూయ స్థానంలో యాంకరింగ్ చేసేందుకు వర్షిణిని ఎంపిక చేశారని.. దీంతో ఈ షో టీఆర్పీ రేటింగ్స్ ఏమేరకు వుంటాయోనని ప్రస్తుతం వాదన మొదలైంది. 
 
కాగా జబర్దస్త్‌లో అనసూయ యాంకరింగ్, హైపర్ ఆది స్కిట్లకు మంచి క్రేజున్న సంగతి తెలిసిందే. వీరి స్కిట్లను యూట్యూబ్‌లో వీక్షించే వారి సంఖ్య లక్షల్లో వుంటుందని నిర్వాహకులు చెప్తున్నారు.