శ్రీలంకన్ బ్యూటీపై కన్నేసిన పవన్ కళ్యాణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో జోరు పెంచారు. వరుస చిత్రాలకు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత ముగ్గురు దర్శకులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఓ ప్రాజెక్టును దగ్గుబాటి రానాతో కలిసి పవన్ నటించనున్నారు.
ఈ క్రమంలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి.
ఈ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్‌లో ఎవరు కనిపిస్తారనే దానిపై ఇప్పటివరకు రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. కథానుగుణంగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లుండగా... క్రిష్ అండ్ టీం ఇప్పటికే నిధి అగర్వాల్‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ప్రకటించింది.
మరో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఫైనల్ చేసినట్టు ఫిలింనగర్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనున్నట్టు తెలుస్తోంది.
జాక్వెలిన్ గతంలో ఎన్నడూ కనిపించనట్వంటి రోల్‌లో కనిపిస్తుందని సమాచారం. డైరెక్టర్ క్రిష్‌కు బాలీవుడ్‌తో మంచి కాంటాక్ట్స్ ఉండటంతో. జాక్వెలిన్‌ను కీలక పాత్ర కోసం డేట్స్ సర్దుబాటు చేసే పనిలో ఉన్నట్టు చర్చ నడుస్తోంది.
జాక్వెలిన్‌కు ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ శ్రీలంక భామ ఈ సారి పూర్తిస్థాయి రోల్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.