గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (17:38 IST)

జూనియర్ ఎన్టీఆర్‌తో అయితే నాకంత అవసరం లేదంటున్న జాహ్నవి కపూర్

ఆర్.ఆర్.ఆర్. సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివతో ఒక సినిమా ప్లాన్ చేశారు. అయితే భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు నిర్మాతలు.

 
కానీ జూనియర్ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఒకవైపు ఆలియా భట్ మరోవైపు కియారా అద్వానీ, శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌లు పోటీలు పడుతున్నారట. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న కొరటాల శివ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఈ ముగ్గురు హీరోయిన్లతో డైరెక్టర్ మాట్లాడారట.

 
టాలీవుడ్ నిర్మాతలు బాలీవుడ్ హీరోయిన్లకు డబ్బులు కూడా ఎక్కువ ఇస్తుండడంతో ఈ ముగ్గురు హీరోయిన్లు పోటీ పడుతున్నారట. కానీ డైరెక్టర్ మాత్రం శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్‌ని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

 
మిగిలిన ఇద్దరు హీరోయిన్లు అధికంగా రెమ్యూనరేషన్ అడిగితే జాహ్నవి కపూర్ మాత్రం అంత డబ్బులు అవసరం లేదని చెబుతోందట. దీంతో ఆమెనే ఫైనల్ చేయాలన్న నిర్ణయానికి డైరెక్టర్ వచ్చినట్టు తెలుస్తోంది.