Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబీపై అసహనం వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా?

శనివారం, 1 జులై 2017 (10:30 IST)

Widgets Magazine

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో జై లవకుశ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మూవీ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్నాడు బాబీ. 
 
ఎలాంటి హడావుడి పడకుండా అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కిస్తున్నాడు. దీంతో షూటింగ్ కాస్త నెమ్మ‌దిగా సాగుతోంద‌ట‌. షూటింగ్ కాస్త లేటు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయ‌మ‌ని, ఎలాగైనా సెప్టెంబ‌ర్ 21న ఈ సినిమాను రిలీజ్ చేయాలని బాబీతో ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. జై లవకుశ సినిమా టీజర్, కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఆ సినిమా దర్శక నిర్మాతలు బాబీ, కల్యాణ్ రాం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్ లైన్ ఎడిటర్ గణేష్‌పై వాళ్లు అనుమానం వ్యక్తం చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. లీకేజీ వెనుక ఇంకా ఎవరెవ‌రు ఉన్నారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దాసరి ప్రాణాలు తీసింది: రేలంగి

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. ...

news

పవన్‌కు అందమైన భార్య... చక్కని కుమార్తె ఉంది.. ప్లీజ్ అర్థం చేసుకోండి : రేణూ దేశాయి

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు, తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ మరోమారు ...

news

అనుష్క ఎక్కడ ఇబ్బంది పడుతోందో అక్కడే మేలుకున్నా.. కీర్తి సంబరం

అప్పటికీ, ఇప్పటికీ, ఇప్పటికీ దక్షిణాది ఎవర్ గ్రీన్ హీరోయిన్ సావిత్రి పాత్రను పోషించే ...

news

లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా... విషయాన్ని చూసి సెన్సార్ అదిరిపోయింది... ఆపలేకపోయింది...

ఈమధ్య కాలంలో ఎందుకో కొందరు నిర్మాతలు పూర్తిగా బూతు సినిమాల మీద దృష్టి సారించేశారు. తెలుగు ...

Widgets Magazine