శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: శుక్రవారం, 20 మార్చి 2015 (21:46 IST)

కాజల్ అగర్వాల్ కు ఆ రెండూ చేయాలని ఉన్నదట...

ఒకప్పుడు ఐటంసాంగ్‌లు చేయాలంటే దానికి వాంప్‌ నటీమణులు వుండేవారు. కానీ రానురాను అది హీరోయిన్ల చేసే స్థాయికి చేరుకుంది. ఆ కోవలో చార్మి నుంచి చాలామంది నటీమణులు ముందంజలో వున్నారు. తాజాగా కాజల్‌ అగర్వాల్‌ తాను అలా చేయాలనుందని తెలియజేస్తుంది. రెండు కోరికలను బయటపెట్టింది. అందులో ఓ కోరిక ఏమిటంటే ఒక పెద్ద స్టార్‌ హీరో సినిమాలో ఐటం సాంగ్‌ చేయాలని, ఆ పాట ఆ సినిమా హిట్టుకు ముఖ్యకారణం కావాలని కోరుకుంటొంది.
 
అంటే బాలీవుడ్‌లో కత్రినాకైఫ్‌లా అన్నమాట. ఇక రెండో కోరిక ఏమిటంటే... లోపల క్రూరత్వం నిండి బయటకు మాత్రం అమాయకంగా కనిపించే క్రూరమైన విలన్‌ పాత్రను చేయాలనే కోరికను ఆమె బయటపెట్టింది. ఎవరైనా దర్శకనిర్మాతలు అలాంటి పాత్రలతో ముందుకు వస్తే డేట్స్‌ ఇవ్వడానికి కాజల్‌ సిద్దమట. క్రూరమైన విలన్‌గా అంటే.. ఇంగ్లీషులో ఓకే కాబోలు.