'బెండు అప్పారావు'ను బుక్ చేసుకున్న 'చందమామ'  
                                       
                  
				  				  
				   
                  				  తెలుగులో తన కామెడీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ కుమారుడిగా వెండితెరకు పరిచయమైనప్పటికీ.. ఆ తర్వాత తన కామెడీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. 
				  											
																													
									  
	 
	అయితే, ఇటీవలి కాలంలో ఈ అల్లరోడు స్పీడు బాగా తగ్గిపోయింది. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ అల్లరి నరేష్‌తో టాలీవుడ్ చందమామ జతకట్టనుందట. 
				  
	 
	నిజానికి కాజల్ అగర్వాల్ టాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితోనూ నటించింది. అయితే కొత్త భామల రాకతో ఇటీవల కాజల్ జోరు కాస్త తగ్గింది. అయినా ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన కాజల్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన కాజల్.. ప్రస్తుతం విశ్వనటుడు కమల్‌హాసన్‌కు జోడీగా 'భారతీయుడు-2'లో నటిస్తోంది. తాజాగా తెలుగులో మరో ఆసక్తికర సినిమాకు కాజల్ ఓకే చెప్పిందట. కొరియా సినిమా 'డ్యాన్సింగ్ క్వీన్' తెలుగు రీమేక్‌లో కాజల్ నటించబోతోందట. 
				  																		
											
									  
	 
	ఇందులో కాజల్‌తో పాటు అల్లరి నరేష్ కూడా నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కాజల్ తమ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని తెలిపారు. అయితే ఈ సినిమాకు ఇంకా దర్శకుణ్ని ఎంపిక చేయలేదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు.