మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (17:12 IST)

బిజినెస్‌మెన్‌తో ఫిక్స్ అయిన 'చందమామ'.. సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్??

టాలీవుడ్ 'చందమామ' కాజల్ అగర్వాల్. సీనియర్ హీరోయిన్‌గా ఉంది. టాలీవుడ్‌లోకి కుర్రకారు హీరోయిన్లు ప్రవేశం చేశాక ఈ అమ్మడు హవా తగ్గిపోయింది. దీంతో సినీ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఫలితంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలను ఈ అమ్మడు ఏనాడూ ఖండించలేదు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్‌లో మరోవార్త వినిపిస్తోంది. 
 
ఇపుడు ఈ అమ్మడు గౌతమ్ అనే యువ వ్యాపారవేత్తతో ఫిక్స్ అయిపోయిందనీ, వీరిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ విషయం తెలిసిన యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా విషెస్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ జంట వివాహ‌బంధంతో ఒక్క‌ట‌వ్వ‌నున్నార‌ని ఇన్‍‌సైడ్ టాక్‌. మ‌రి ఈ పెళ్లి వార్త‌ల‌పై కాజ‌ల్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 
 
కాగా, కాజ‌ల్ గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 2020లో సెటిలవ్వాల‌నుకుంటున్న‌ట్టు చెప్పింది. అంతేకాదు త‌నకు కాబోయే భ‌ర్త‌ ముఖ్యంగా సంర‌క్ష‌ణ బాధ్య‌తలు చూసుకునే స్వ‌భావం, భ‌క్తిభావం క‌లిగి ఉన్న వ్య‌క్తి అయి ఉండాల‌ని కాజ‌ల్ చెప్పుకొచ్చింది. పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే చేసుకుంటాన‌ని ఇప్పటికే చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవితో కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సంతకం చేసిన విషయం తెల్సిందే.