సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (18:17 IST)

టాలీవుడ్ చందమామ గర్భం దాల్చిందా? ఫోటోలు వైరల్

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిందని, త్వరలోనే కాజల్ సినిమాలకు దూరం కానుందని వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై కాజల్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఓ ఇంటర్వ్యూలో మాత్రం సమయం వచ్చినప్పుడు స్పందిస్తానంటూ మాట దాటేసింది. 
 
ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన స్నేహితులతో కలిసి సరదాగా దీగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది కాజల్‌. ఇందులో కాజల్‌ కాస్తా బేబీ బంప్‌ ఉన్నట్లు కనిపించింది. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చిందని, అయితే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వస్తోంది.  
 
కాజల్ అగర్వాల్ గత ఏడాది బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఈ జంట వివాహం పంజాబీ మరియు కాశ్మీరీ సంప్రదాయాల సమ్మేళనంతో జరిగింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాలో నటించింది. 2022 ఫిబ్రవరి 4న విడుదల కానున్న ఈ చిత్రానికి శివ కొరటల్ దర్శకత్వం వహించారు.