శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (12:58 IST)

రోబో 2- రజినీకాంత్ హీరో, కమల్ హాసన్ విలన్ - డైరెక్టర్ శంకర్

'ఐ' చిత్రం తర్వాత శంకర్‌ 'రోబో-2'పై దృష్టిపెట్టాడు. మొదట రోబో సీక్వెల్‌లో హీరోగా పలువురు పేర్లు వినిపించినా తిరిగి రజినీకాంత్‌నే ఎన్నుకున్నాడు శంకర్‌. ఇక అదేస్థాయిలో ప్రతినాయకుడి పాత్ర కోసం కూడా పలువురు స్టార్లను పరిశీలించిన శంకర్‌ బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌ను ఈ పాత్ర కోసం ఎంచుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. తాజా సమాచారం ప్రకారం బిజీ షెడ్యూల్‌ కారణంగా అమీర్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారని తెలిసింది. ఆయన స్థానంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ఈ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. 

 
కమల్‌ పూర్తిస్థాయి ప్రతినాయకుడి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, రోబో చిత్రం షూటింగ్ సమయంలో సీక్వెల్‌ చేయాలని ఆలోచన వచ్చిందనీ, కొంత భాగం కూడా షూట్‌ చేశారని టాక్‌ కూడా విన్పిస్తోంది. కొత్తగా ఏడ్‌ అయ్యేది కమల్‌ పాత్రే. కెరీర్‌ ప్రారంభంలో ఇద్దరూ కలిసి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.