Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కమల్ హాసన్ కొత్త పార్టీ... దసరా రోజు ప్రకటన?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (07:13 IST)

Widgets Magazine
kamal haasan

విశ్వనటుడు కమల్ హాసన్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారు. ఈ విషయాన్ని ఆయన దసరా పండుగ రోజున అధికారికంగా ప్రకటించనున్నారు. 
 
తమిళ చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీనటుల్లో కమల్ హాసన్ ఒకరు. ఈయన గత కొన్ని రోజులుగ రాజకీయాల్లో తలదూర్చుతూ వస్తున్నారు. ముఖ్యంగా, జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతిపై అస్త్రాలు సంధిస్తున్నారు. 
 
దీంతో అన్నాడీఎంకే మంత్రులకు, కమల్ హాసన్‌కు పెద్ద మాటల యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సారథ్యంలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. 
 
ప్రముఖ నటుడు కమలహాసన్ విజయ దశమి, లేదంటే గాంధీ జయంతి రోజున తన రాజకీయ  పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఆ వెంటనే నవంబరులో జరగనున్న తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీ చేయనున్నట్టు సమాచారం. 
 
మొత్తంగా 4వేల మందిని అభ్యర్థులను కమల్ బరిలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. డీఎంకేతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో కమల్ ఉన్నట్టు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

టాలీవుడ్ నటుడి భార్య మృతి...

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిన్న భార్య శిరీష (42) చనిపోయింది. గత కొంతకాలంగా ...

news

'కత్తి'కి సంపూ అది పెట్టేశాడు... ఖుషీగా పవన్ ఫ్యాన్స్

కొంతమంది నటులు మాట్లాడితే చాలు మహా ఖుషీగా వుంటుంది. ఇప్పుడు నటుడు సంపూర్ణేష్ బాబు చేసిన ...

news

వయసులో పెద్దదయినా అనుష్క ఇంకా...

తెలుగు సినీ హీరోయిన్లు సాధారణంగా వయస్సు తెలియకుండా జాగ్రత్తపడుతుంటారు. 35 సంవత్సరాలు ...

news

అలీ ఏడుస్తూ నా దగ్గరకొచ్చాడు... ఎందుకేడుస్తున్నావనడిగితే.... పోసాని

సినీ ఇండస్ట్రీలో ఒకరి పాత్రను ఇంకొకరు ఎగరేసుకుని వెళ్లిపోవడం మామూలే. ఒక నటుడితో అనుకున్న ...

Widgets Magazine