గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (18:59 IST)

వెబ్ సిరీస్‌గా రానున్న గురజాడ కన్యాశుల్కం.. మధురవాణిగా ఎవరు?

Anjali look
గురజాడ కన్యాశుల్కం వెబ్ సిరీస్‌గా రానుంది. కన్యాశుల్కం నాటకం సినిమాగా మాత్రమే కాదు, ఆ తరువాత బుల్లితెరపై కూడా సందడి చేసింది. అలాంటి ఈ నాటకం ఇప్పుడు వెబ్ సిరీస్‌గా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధమవుతోంది. దర్శకుడు క్రిష్‌కి నాటకాలపై నవలలపై మక్కువ ఎక్కువ. అందువల్లనే ఆయన ఈ కథను సిరీస్‌గా అందించడానికి రెడీ అవుతున్నాడు. 
 
గతంలో ఒకటి .. రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన శేష సింధూరావు, ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఇందులో మధురవాణిగా అంజలి నటిస్తోంది. గిరీశం పాత్రలో అవసరాల నటించారు. ఆరు ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ సిరీస్ త్వరలోనే జీ-5లో స్ట్రీమింగ్ కానుంది. క్రిష్ సారథ్యంలో వస్తున్న ఈ సిరీస్ ఏ మేరకు మెప్పిస్తుందనేది వేచి చూడాలి.