శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 మే 2017 (18:00 IST)

'బాహుబలి-2' మూవీ థియేటర్ టిక్కెట్ ధర రూ.200 : బ్లాక్‌లో రూ.1000 చెల్లించి కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం అందుకుంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ టాక్‌ను

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "బాహుబలి 2 ది కంక్లూజన్". ఈ చిత్రం గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయం అందుకుంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం టిక్కెట్ ధరలు లభించడం లేదు. ఫలితంగా బ్లాక్‌లో భారీ ధరలు చెల్లించి కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా బాహుబలి టిక్కెట్లను బ్లాక్‌లో కొనుగోలు చేసిన వారిలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారట. ఆయన ఎవరో కాదు.. కర్నాటక సీఎం సిద్ధరామయ్యట. 
 
నిత్యం రాజకీయాలతో తీరికలేకుండా గడిపే ఈయన తాజాగా ఒకేరోజు ఏకంగా రెండు సినిమాలు చూశారు. వీటిలో ఒకటి 'బాహుబలి 2'. అయితే, బాహుబలికి టిక్కెట్లు లభించక పోవడంతో ఆయన మనువడు ఏకంగా ఒక్కో టిక్కెట్‌కు ఏకంగా రూ.1000 చెల్లించి కొనుగోలు చేశారట. వాస్తవంగా థియేటర్‌ టిక్కెట్ ధర రూ.200 మాత్రమే. 
 
బెంగళూరులోని రాజాజీనగర్‌లో ఉన్న ఓరియన్ మాల్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిసి సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాహుబలి-2 సినిమా వీక్షించారు. సినిమా చూడటానికి సీఎం మనవడు 48 టిక్కెట్లు బుక్ చేశాడట. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. 
 
ఏకంగా ఓ ముఖ్యమంత్రే బ్లాక్‌లో అధిక ధరకు టిక్కెట్లు బుక్ చేసుకుని సినిమా చూడటాన్ని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మల్టీఫెక్స్ థియేటర్లలో ఒక్క టిక్కెట్ రూ.200 కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని ఆదేశాలు జారీ చేసిన సీఎం స్వయంగా ఆయనే ఎక్కువ ధర చెల్లించి సినిమా ఎలా చూస్తారని ప్రశ్నిస్తున్నారు.