గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (11:24 IST)

దసరా కోసం 12 కేజీలు తగ్గాను.. తెలంగాణ యాసలో.. కీర్తి సురేష్

keerthy suresh
నటి కీర్తి సురేష్‌కి దసరా ప్రత్యేకం. ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలక పాత్రలో కనిపించింది. తెలంగాణ సంస్కృతిలో పాతుకుపోయిన పాత్రలో కనిపించింది. తెలంగాణ యాసలో తన గాత్రాన్ని డబ్బింగ్ చేసింది. కచ్చితంగా ఇది ఆమెకు కష్టమైన పాత్ర. "నేను లోకల్" తర్వాత నానితో కలిసి నటించిన దసరా రెండవ చిత్రంలో.. నాని భార్యగా కనిపించింది. మార్చి 30వ తేదీ విడుదలై భారీ కలెక్షన్ల కురిపించింది. 
 
దసరాలో ఆమె పాత్ర గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ‘దసరా’లో నాది కష్టమైన పాత్ర. మేకప్ వేయడానికి, తొలగించడానికి కూడా చాలా గంటలు పట్టేది. తెలంగాణ యాస మాట్లాడే పాత్రలో నటించడం మొదట్లో కష్టమైంది. కానీ కొంతకాలం తర్వాత, నేను అలవాటు పడ్డాను. నేను కాస్త అధిక బరువుతో ఉన్నాను. బరువు తగ్గాలని దర్శకుడు శ్రీకాంత్ రిక్వెస్ట్ చేశారు. సినిమా కోసం 12 కిలోల బరువు తగ్గాల్సి వచ్చింది... అంటూ చెప్పుకొచ్చింది.