సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: బుధవారం, 2 ఆగస్టు 2017 (18:53 IST)

కాంగ్రెస్ పార్టీకి బ్యాండ్... కమల్ సర్ నేను నీతో నడుస్తానంటున్న కాంగ్రెస్ (నటి) నాయకురాలు

కమల్ హాసన్‌తో ఖుష్భూ కలిసి నడవడమేంటి అనుకుంటున్నారా..ఇప్పటికే ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయి పెళ్ళిళ్ళు చేసేంత వయస్సును పిల్లలు కూడా వీరికి ఉన్నారు కదా..ఇప్పుడెందుకు కలిసి నడవడం అనుకుంటున్నారా.. కలిసి నడవడమంటే భాగస్వామ్యులుగా కాదు.. రాజకీయాల్లో.. కమల్ హాసన

కమల్ హాసన్‌తో ఖుష్భూ కలిసి నడవడమేంటి అనుకుంటున్నారా..ఇప్పటికే ఇద్దరికి పెళ్ళిళ్లయిపోయి పెళ్ళిళ్ళు చేసేంత వయస్సును పిల్లలు కూడా వీరికి ఉన్నారు కదా..ఇప్పుడెందుకు కలిసి నడవడం అనుకుంటున్నారా.. కలిసి నడవడమంటే భాగస్వామ్యులుగా కాదు.. రాజకీయాల్లో.. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నేపథ్యంలో అటు తమిళనాడులో చాలామంది వ్యతిరేకిస్తే ఖుష్భూ మాత్రం కమల్‌కు నేను అండగా ఉంటూ చెప్పారట.
 
కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలి. కమల్ లాంటి వ్యక్తి రాజకీయాలకు ఎంతో అవసరం. ఆయన వెంట రాజకీయాల్లోకి నడిచేందుకు సిద్థంగా ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమల్ రాజకీయాల్లోకి రావడం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పుకొచ్చారట ఖుష్భూ. ఒక నటి ఈ విధంగా ప్రకటన చేయడంతో అటు రాజకీయ పార్టీ నేతల్లోను, ఇటు సినీప్రముఖుల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖుష్భూ కమల్ హాసన్ పార్టీ పెట్టిన తరువాత ఎంతమాత్రం పార్టీని ముందుండి నడిపిస్తుందో వేచి చూడాల్సిందే.