సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (18:56 IST)

నేను ఎవరితో ప్రేమలో పడలేదు.. నేను సింగిల్ గానే వున్నా: కైరా అద్వానీ

అందాల భామ కియరా అద్వానీ తాను ఎవరితోనూ ప్రేమలో లేనని స్పష్టం చేసింది. బాలీవుడ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో తాను ప్రేమాయణం సాగిస్తున్నానంటూ వచ్చిన వార్తలపై ఆమె స్పందించింది. 
 
తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ, తనపైన వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవని కియరా కొట్టిపారేసింది. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్‌ జోహర్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రాని ప్రశ్నించగా, పని తప్ప తనకి ఇంకేదీ సంతోషాన్ని ఇవ్వదని అతను సమాధానమిచ్చాడు.
 
కియరాతో పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ, పత్రికల్లో తనపై వచ్చే గాసిప్‌ల గురించి తనకు ఏమీ తెలియదంటూ, తన జీవితం అందరూ అనుకుంటున్నట్లు రంగులమయంతో ఏమీ లేదంటూనే, నిజజీవితంలో తనకు ఉండే ఆనందాలు చాలా తక్కువ అని చెప్పుకొచ్చాడు.
 
ఓవైపు తమ మధ్య ఎలాంటి ఎలాంటి సంబంధాలు లేవని సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీలు చెబుతుండగా.. సిద్ధార్థ్‌ మాజీ ప్రేయసి ఆలియా భట్‌ మాత్రం కియారాతో అతడు డేట్‌కు వెళ్తే బాగుంటుందని చెప్పడం విశేషం. 
 
భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ ప్రస్తుతం కళంక్, అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ చిత్రాల్లో, అలాగే అక్షయ్‌ కుమార్‌‌తో కలిసి గుడ్‌ న్యూస్‌ తదితర సినిమాల్లో నటిస్తోంది.