మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : సోమవారం, 3 జులై 2017 (17:35 IST)

ఆలూ మొహం ఉన్న అతను పెద్ద హీరోనా? : బన్నీపై కేఆర్కే కామెంట్స్

ఆలూ మొహం ఉన్న అల్లు అర్జున్ టాలీవుడ్‌లో పెద్ద హీరోనా? అంటూ చిత్ర విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై అల్లు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణంగా స

ఆలూ మొహం ఉన్న అల్లు అర్జున్ టాలీవుడ్‌లో పెద్ద హీరోనా? అంటూ చిత్ర విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై అల్లు ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సాధారణంగా సినీ సెలెబ్రిటీలతో పాటు కొత్తగా విడుదలయ్యే చిత్రాలపై పిచ్చిపిచ్చిగా విమర్శలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించడంతో కేఆర్కేను మించినవారు లేరు. 
 
ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్‌కు బన్నీ ప్రచారకర్తగా ఉన్నారు. ఈ యాడ్‌ను చూసిన కేఆర్కే బన్నీని ఆలూతో పోల్చాడు. కాగా, తాజాగా "దువ్వడా జగన్నాథం" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్, ప్రభాస్‌లపై నీచమైన కామెంట్స్ చేసిన కేఆర్కే ఇపుడు బన్నీని టార్గెట్ చేయడం గమనార్హం. 
 
ఆలూ మొహం ఉన్న ఇతను తెలుగులో పెద్ద స్టార్ హీరో అని కొంతమంది తనకు చెప్పారంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, 'బ్రదర్ చిన్నిచిన్ని క్యారెక్టర్లు చేయాలనుకుంటేనే నీవు బాలీవుడ్‌కు రా' అంటూ కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో కేఆర్కేపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కేఆర్కేను ఏకిపారేస్తున్నారు.